Take a fresh look at your lifestyle.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి….

0 1,375

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్ జితేష్వి  పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చ్13 ( లోకంతీరు )  : ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం మద్నూర్ లోని ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షల నిర్వహణ తీరును, హాజరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు  37 కేంద్రాలలో జరిగిన ఇంటర్మీడియట్ రసాయన శాస్త్రం, కామర్స్, , ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. జనరల్ పరీక్షకు  8,347 మంది విద్యార్థులకు గాను  గాను 8,021 మంది  హాజరు కాగా 326 మంది గైర్ హాజరు అయ్యారని అన్నారు. అదేవిధంగా ఒకేషనల్ పరీక్షకు 1,467 మంది విద్యార్థులకు గాను 1,298 మంది హాజరు కాగా మరో 165 మంది హాజరు కాలేదని కలెక్టర్ తెలిపారు. మిగతా పరీక్షలు సైతం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, నిర్వహకులను ఆదేశించారు.కలెక్టర్ వెంట జిల్లా  ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, తహసీల్ధార్ ముజీబ్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.