Take a fresh look at your lifestyle.

కేజీవీబి లో వైద్య శిబిరం…..

0 1,537

కేజీవీబి లో వైద్య శిబిరం

— వైద్యాధికారి సురేష్

కామారెడ్డి జిల్లా , జూలై 26 ( లోకంతీరు ) : రామారెడ్డి కేజీవీబీ హాస్టల్ పిల్లలకు వైద్యాదికారి సురేష్ వైద్యబృందం తో ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేసి జ్వరం ఉన్న వారి నుండి రక్తం సేకరించి వారికి పరీక్షలు నిర్వహించారు.అవసరం ఉన్న పిల్లలకు మందులు అందించారు. అనంతరం డాక్టర్ సురేష్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, టైఫైడ్ , మొదలగు వ్యాధుల ప్రబల కుండా ఉండాలంటే మనచుట్టూ ప్రక్కల పరిసరాలు బాగుంచుకోవాలి.గుంటలల్లో నీళ్లు నిల్వ ఉండ కుండా చూసుకోవాలి.తినే పదార్థాలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. మంచి నీళ్లు కాచి వాడ పొసుకొని త్రాగాలి ఇలా ప్రత్యేక మైన చర్యలు తీసుకుంటే ఎలాంటి వ్యాదులు దగ్గరకు రావు అని పిల్లలకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నారం వైద్యురాలు డాక్టర్ మానస, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.