Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్రంలో….రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది…..

0 1,584

తెలంగాణ రాష్ట్రంలో….రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది…..

  • మోడీ అభివృద్ధి చేసినా హైవేలపైనే రాహుల్ ప్రియాంకల పాదయాత్ర…
  • నమ్మకం లేని రాహుల్ ఇంజన్ సర్కార్ …..
  •  భైంసా బహిరంగ సభలో… అస్సాం సిఎం హేమంత బిశ్వశర్మ….

బైంసా, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని, అభివృద్ధి చేయలేదని నిందించే కాంగ్రెస్ కి మోడీ అభివృద్ధి చేసినటువంటి జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ లు పాదయాత్రలు చేపట్టడమే సమాధానమని అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ అన్నారు. మంగళవారం విజయ సంకల్ప బస్సు యాత్రలో భాగంగా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్.ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ విజయ సంకల్ప యాత్ర 5500 కిలోమీటర్ల మేర సాగనుందని, మూడోసారి ముచ్చటగా మోదినే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పదంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో బిజెపి రోజురోజుకు బలపడుతుందని 2018 సంవత్సరంలో 6.8% ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9% ఓట్లు శాతం వచ్చాయన్నారు. బి.ఆర్.ఎస్,కాంగ్రెస్ ఒక్కటేనని,వీళ్ళ పాలన రజాకార్ల పాలనని ,దీన్ని అంతం చేసే రోజులు ఆసన్నమైందన్నారు. భారత ప్రజలు కాంగ్రెస్ నీ తరిమి మోడీని తీసుకొచ్చారని, మోడీ రామ మందిరాన్ని తీసుకొచ్చారని ప్రస్తుతం ప్రజలు మోడీని ముచ్చటగా మూడవ సారి ప్రధాని గా చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోడీకె దక్కిందన్నారు.

తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని అన్నారు.ప్రదాని మోడీ మాత్రం పక్కాగా హామీలను నెరవేర్చే వ్యక్తి అని కొనియాడారు. అస్సాం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తు ప్రజలపై భారాన్ని వేస్తున్నారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదేనని, ప్రపంచ దేశాలే తన వైపు తిరిగి చూస్తున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి భాజపా ఎం.పి అభ్యర్థికి అత్యధిక మెజార్టీ అందించాలని, అదిలాబాద్ పార్లమెంట్ సీట్ నీ గెలిపించాలని కార్యకర్తలను కోరారు.

  ఈ బహిరంగ సభలో మణిపూర్ మంత్రి సుసింద్రీ, జాతీయ ఓబీసీ నాయకులు,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు,బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్,పాయల్ శంకర్,హరీష్ పాల్వాయి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, పదాధికారులు, యాత్ర ప్రముఖులు, బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సభలో వివిధ గ్రామాల సర్పంచులు పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.