మోతే గ్రామంలో సీడ్ బాల్స్ తయారుచేసిన ఎన్ జి ఓ సంస్థ

కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సెవెన్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండవ విడత సీడ్ బాల్స్ లింగంపేట మండలం మోతే గ్రామంలో తయారు చేసారు. ఎన్ జి ఓ ఫౌండర్ జీవన్ నాయక్ ఆదేశాల మేరకు రెండవ విడత సీడ్ బాల్స్ ను తయారు చేయడం జరిగిందని కోఆర్డినేటర్ పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా తయారుచేసిన సీడ్ బాల్స్ మొలకెత్తి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో రెండో విడత సీడ్ బాల్స్ లను ప్రతి ఎన్జీవో వాలంటీర్ల ఇంటి వద్ద తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు భాగ్య లక్ష్మి, మౌనిక, పూజిత, నవనీత, పూజా, శ్రీనివాస్, అశ్విని, పలువురు పాల్గొన్నారు.