Take a fresh look at your lifestyle.

బొంపల్లి గ్రామపంచాయతీ కి ప్రత్యేక అధికారిని నియమించాలి …

0 988

బొంపల్లి గ్రామపంచాయతీ కి ప్రత్యేక అధికారిని నియమించాలి 

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామపంచాయతీ కి ప్రత్యేక అధికారిని నియమించాలని మండల పంచాయత్ అధికారి సురేందర్ రెడ్డి ని మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. గత నెల రోజులుగా గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారి లేకపోవడం వల్ల సమస్యలు పేరుకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారి బదిలీ చేసినప్పటికిని తిరిగి మరో అధికారిని నియమించడంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మరో అధికారిని నియమించాలన్నారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారిని మీరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళ లేక పోయారని నిలదీశారు.గ్రామంలో ప్రత్యేక అధికారి లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనులు పడకేశాయని ఆరోపించారు. ఇప్పటికే గ్రామంలో విష జ్వరాలు సోకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.అధికారులు బాధ్యత తీసుకొని ప్రత్యేక అధికారి నియమించాలని డిమాండ్ చేశారు.వెంటనే స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని జిల్లా అధికారులను కోరారు. అందుకు మండల పంచాయతీ అధికారిగా మీరు వారి దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించారు. మాజీ జెడ్పిటిసి వెంటా ధర్మరావుపేట సురేష్ సీనియర్ అసిస్టెంట్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.