Take a fresh look at your lifestyle.

మృతుడి కుటుంబన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత….

0 1,145

మృతుడి కుటుంబన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా

ఎల్లారెడ్డి, నవంబర్  02 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన దండురత్నయ్య ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా శనివారం వారి కుటుంబానికి పరామర్శించి మనోధైర్యం కల్పించి ఆర్థిక సాయం అందజేశారు.వారి కుటుంబనికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు జక్కి కిష్టాన్నగారు, రాజు, సాయిలు, వెంకట్ రాములు, నాగయ్య, హన్మాండ్లు, ప్రకాష్, కాశిరాం, మదర్, సుదర్శన్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్ ,తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.దొబ్బరోగంతో మృత్యువాత పడుతున్న గొర్రెలు ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండాలో మేకలు గత వారం నుడి దొబ్బరోగంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా వెంటనే గ్రామానికి వెళ్లి ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే వెటర్నరీ డాక్టర్ రవి చరవాణిలో మాట్లాడి తండావాసుల సమస్యలు తీర్చిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా. అయన వెంట ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, తిమ్మాపూర్ తండా గ్రామ అధ్యక్షులు ప్రకాష్, పట్టణ యూత్ అధ్యక్షులు సిద్దు, మైపాల్, భాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.