రేకుల షెడ్ లో నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
– కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని మాచరెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ కే డి జి పాఠశాల, నాగిరెడ్డిపేట్ మండలంలో ఉన్న కేరళ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్ లో నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సోమవారం బివిఎం నాయకులు వినతి పత్రం అందజేసారు. రేకుల షెడ్ లో నడవడం వల్ల విద్యార్థులు వేడికి తట్టుకోలేకపోతున్నారని, వర్షం పడితే అ శబ్దంకు విద్యార్తులు భయపడుతున్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం రేకుల షెడ్లలో పాఠశాలలో నడపద్దని విద్య హక్కు చట్టం చెబుతున్న అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేకుల షెడ్లలో ప్రమాదాలకు గురై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి ఆటస్థలం గాని సరైన మౌళిక సదుపాయాలు లేవన్నారు. విద్యార్థులకు సరైన బాత్రూంలు, టాయిలెట్ లు లేవన్నారు. కావున నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్న ఎస్ కె డీ జీ, కేరళ పాఠశాలపై చర్యలు తీసుకొని అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా ( బివిఎం) రాష్ట్ర కార్యదర్శి జివియం విఠల్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు మణికంఠ, బీవీఎం జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.