Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం….

0 1,262

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం

– వ్యవసాయ అధికారి సునీత రాణి

కామారెడ్డి జిల్లా/ రాజంపేట, ఆగస్టు 20 (లోకంతీరు) : రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నూతన మండల వ్యవసాయ అధికారిణి సునీత రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నుండి మండల కేంద్రానికి బదిలీల్లో నూతనంగా మండల వ్యవసాయ అధికారిని సునీత రాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంటలో అక్కడక్కడ మోగి పురుగు (కాండం తోల్చు పురుగు) గమనించారు. మోగి పురుగు గమనించిన వెంటనే కార్బోప్యూరాన్ 3 జి గుళికలు ఒక ఎకరానికి 8 -10 కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 7-8 కిలోలు ఇసుకలో సమనంగా కలిపి సాయంత్రం వేళల్లో చల్లుకోవాలని తెలిపారు. పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ ( 50% ఎస్ పి) మందును 2 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పొలం అంతా సమానంగా పిచికారి చేయాలని అన్నారు. మొక్కజొన్న పంటలో ఆకులు ముదురు నీలి రంగు లోకి మారిపోతాయి. కావున లోపం గమనించిన వెంటనే డి ఏ పి పోషక ఎరువును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. అలాగే ఎరువుల యాజమాన్యం కలుపుతీత క్రమక్రమంగా చేయడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ రైతులు నూతనంగా వచ్చిన వ్యవసాయ విస్తరణ అధికారులు శిల్ప, రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.