Take a fresh look at your lifestyle.

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం…

0 1,797

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు )  : కామారెడ్డి జిల్లాలో పారిశుద్ధ్య వారోత్సవాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 7 నుంచి 14 వరకు పట్టణ, గ్రామస్థాయిలో చేపట్టే పనుల వివరాలను జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో గ్రామ సెక్రెటరీ సాగర్ గౌడ్ పర్యవేక్షణలో రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్పి సాయిబాబా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండలం బంజర తాండ, పెద్దకోడప్గల్ మండలం పోచారం తండాలో గురువారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని మురికి కాలువలను శుభ్రం చేయించారు. పాఠశాలలు, అంగన్వాడి , ఆరోగ్య ఉప కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్టాండ్లు శుభ్రం చేయించారు. గ్రామాల్లో గల లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తీసివేసి, నీరు నిల్వ ఉండకుండా పూడిచి వేశారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను, భవనాల పరిసర ప్రాంతాల్లో గల చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. గ్రామపంచాయతీలో అన్ని కుటుంబాలు శుక్రవారం డ్రై డే ని పాటించాలని అధికారులు సూచించారు. వాటరింగ్ డే లో భాగంగా గ్రామపంచాయతీలో గల మొక్కలకు నీటిని పోసే విధంగా చూడాలని అధికారులు తెలిపారు. మరుగునీటిని నిలువ లేకుండా చూసి, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ ని ఉపయోగించాలని చెప్పారు. దోమల నివారణకు యాంటీ లార్వా, రసాయనాలు పిచికారి చేయాలన్నారు. గ్రామాలలోని తాగినీటి వనరులను అధికారులు తనిఖీ చేసి క్లోరినేషన్ చేసే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో పైప్ లైన్ లీకేజీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.