ఐ టి ఐ ని సందర్శించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని బిచ్కుంద మండల కేంద్రంలోని ఐటిఐ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఐటిఐ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల గురించి ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఉన్నారా అని ఆరా తీశారు. రెండవ సంవత్సరం ఐటిఐ చదువుతున్న విద్యార్థులను భవిష్యత్తులో మీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిషన్, మెకానిక్ ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో రెండేళ్లు చదివితే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు.