Take a fresh look at your lifestyle.

ఆధునిక హంగులతో కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లు : ఎమ్మెల్యే కూనంనేని.

0 5

ఆధునిక హంగులతో కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లు.
సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక.. ప్రయాణికులకు మెరుగైన వసతులు.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే కూనంనేని
త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం/పాల్వంచ, సెప్టెంబర్ 5: ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న బస్టాండ్లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి కొత్తగూడెం బస్టాండ్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు, వర్షాకాలంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారులకు కూనంనేని వివరించారు. నూతన భవన నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి తక్షణమే రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్ నూతన నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ నిధులు కూడా జోడించి దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో రెండు బస్టాండ్లను ఆధునిక వసతులతో పునర్నిర్మించేందుకు చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు సకల సదుపాయాలు అందేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.