Take a fresh look at your lifestyle.

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి………

0 1,139

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

– న్యాయ మూర్తి హారిక

ఎల్లారెడ్డి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి హారిక అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మండల మీసంపల్లి గ్రామ రైతు వేదికలో కామారెడ్డి జిల్లా స్థాయి సఖి కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి హారిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయ మూర్తి హరిక మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు కుటుంబ సభ్యుల నుండి ఎదుర్కొంటున్న హింసలను గృహ హింస అంటారని, ఇది 2005 సంవత్సరంలో చట్టం వచ్చిందని కుటుంబంలో భర్త నుండి ఇతర కుటుంబ సభ్యుల నుండి మానసికంగా, శారీరకంగా ,ఆర్థికంగా ఎదుర్కొనే హింసలన్నీ కూడా గృహహింస కిందికి వస్తాయని వాటిని ఎదుర్కొంటున్న వారు సంబంధిత శాఖ పోలీస్ శాఖ, సఖి కేంద్రం వారిని గ్రామస్థాయిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ని సహకారం తీసుకోవాలన్నారు. వీటితోపాటు స్త్రీలు పనిచేసే చోట ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను గురించిపై అధికారులకు తెలియజేయాలని చెప్పారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతూ వీటి కోసము కఠినమైన శిక్షలు ఉన్నాయని వీటి నుండి మనల్ని మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని పిల్లలతో సున్నితమైన విషయాలను స్నేహితులుగా మాట్లాడి తెలుసుకోవాలని సూచించారు.చిన్న పిల్లలకి బాల్యవివాహాలు చేయడం వల్ల బాల్య వివాహ వివాహ నిరోధక చట్టం ప్రకారము నేరమని తెలియజేశారు. కుటుంబంలో వరకట్నం కోసం వేధించిన మహిళలపై తగు చర్యలు తీసుకో బడతాయని వివరించారు. అంతే కాకుండా ముఖ్యంగా స్రీలు సాధారణంగా ఓపిక గల వారై ఉంటారని , కానీ ఒక పరిధి మేరకే ఓపిక మంచిదని , మన కుటుంబం పరువు గురించో, మన యొక్క వ్యక్తి గత గౌరవాన్ని భంగం కలుగుతుoదో అని మీ యొక్క జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దని కార్యక్రమంలో పాల్గొన్న మీసన్ పల్లి గ్రామ ప్రజలకు సూచించారు. మహిళలు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా సమస్య గూర్చి ఇతరులతో చర్చించాలని , ఇలాంటి నిత్యం జరుగుతున్న మహిళా సమస్యల పై చైతన్య వంతం గా ఉండాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ప్రాజెక్టు సీడీపీఓ సరిత, సఖి కేంద్రం సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భారతి, ఏపీడీఓ మురళీకృష్ణ, ఏపీఎం ప్రసన్న రాణి,ఎస్ ఐ మహేష్,ఐసీపీఎస్ పీఓ సంతోష్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ స్వరూప, సఖి లీగల్ కౌన్సిలర్ నవీన్,సఖి సైకో సోషల్ కౌన్సిలర్ కవిత, పద్మాపాని,సఖి సపోర్ట్ ఏజెన్సీ మేనేజర్ అరుణిమ, ఐకెపి మహిళలు, అంగన్వాడి టీచర్లు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.