Take a fresh look at your lifestyle.

గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్…

0 1,232

గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ 

కామారెడ్డి జిల్లా , సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని పర్యావరణంపై అవగహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టర్‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.

పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టిజి పివిబి నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టిజి పీసీబీ సిద్దమౌతుంది. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతోంది.చెరువుల్లో మట్టి మేటలని తొలిగించటానికి చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసారు.

 

 

Leave A Reply

Your email address will not be published.