ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
-
మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఇంటింటి ప్రచారం


నిజామాబాద్ నియోజకవర్గం, మే 4 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41 వ డివిజన్ చంద్ర శేఖర్ కాలనీలో మాజీ శాసనసభ్యులు శ్రీ గణేష్ బిగాల ఇంటింటా ప్రచారం డివిజన్ ఇంచార్జి షేక్ అహ్మద్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అనుభవజ్ఞుడు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. జూట కోర్ పార్టీలు కాంగ్రెస్, బిజెపి లను నమ్మవద్దు.ప్రజలు కాంగ్రెస్ బిజెపి పార్టీలను నమ్మే పరిస్థితులు లేరు. రుణమాఫీ ఇస్తామనడం దేవుళ్ళపై ఓట్లు వేసుకోవడం అది అబద్ధాల రేవంత్ రెడ్డి కే సాధ్యం కళ్యాణ లక్ష్మి , రైతుబంధు మాట ఎత్తని నాయకులు అవసరమా…. కెసిఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాటలకు తప్ప దేనికి పనిచేయడు. పసుపు బోర్డు పేరుతో ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి మళ్లీ పసుపు బోర్డు తెస్తానని చెప్పడం విడ్డూరం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం మళ్ళీ వచ్చింది. అందుకే టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి.ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్ శేఖర్,షేక్ అహ్మద్, విజయలక్ష్మి,సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి,సుజిత్, సత్యప్రకాశ్, కొక్కుల గంగ, బొమ్మెర జ్ఞానేశ్వర్, జింకా అశోక్, షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.