Take a fresh look at your lifestyle.

ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా రక్తదానం….

0 1,257

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన జనసమితి నాయకులు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రంలో గురువారం రక్త దానం చేసారు. కోదండరాం ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడు ప్రజాసేవలో, ప్రజా శ్రేయస్సు కోరం పోరాడాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ రక్తదానం చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రజినీకాంత్, ఉపాధ్యక్షుడు పూల్ సింగ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్, ఆసుపత్రి టెక్నీషియన్ పోశెట్టి, నూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.