Take a fresh look at your lifestyle.

బిజెపి కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం….

0 1,758

బిజెపి కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం

– కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఫిబ్రవరి 04 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ కమిటి ఇంచార్జి,కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి బద్దం మహిపాల్ రెడ్డి, విస్తారక్ శ్రీధర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రవీందర్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ అంబీర్ లింగారావు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి దిశా నిర్దేశం చేయడానికి రామారెడ్డి మండల గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు పార్టీ అంతర్గత విషయాలపై, ఎలక్షన్లో పార్టీని బలోపేతం చేయడానికి రమణారెడ్డి పలు అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లాస్థా నాయకులు, మండల కమిటీ, మహిళా మోర్చా జిల్లా స్థాయి కార్యకర్తలు మరియు మండల స్థాయి కమిటీ బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ మోర్చాల అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.