అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు పనులు పూర్తికి చర్యలు
– ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్

ఎల్లారెడ్డి, నవంబర్ 4 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డు బీసీ కాలనీలో మురికి నీరు నిలువ ఉండకుండా నూతన మురికి కాలువ ను నిర్మిస్తామని స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో నెలకొన్న మురికి కాలువ సమస్యను చైర్మన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుతో కలిసి స్వయంగా పరిశీలించారు. వారం క్రితం కాలని వాసులు సమస్య గురించి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన చైర్మన్, కమిషనర్, మున్సిపల్ ఏ ఈ వినోద్ తో కలిసి కాలనిలో నెలకొన్న సమస్యను ప్రత్యక్షంగా చూసి, లోతట్టు ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న మురికి కాలువ, భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని దిగువన సాఫీగా వెళ్ళడానికి వీలు లేనందున నీరు ఇళ్లలోకి వస్తుందని గుర్తించి , నీరు సాఫిగా వెల్లెలా నీటి సామర్థ్యానికి అనుగుణంగా నూతన మురికి కాలువ నిర్మాణం పనులను వెంటనే చేపట్టే విధంగా ఏ ఈ వినోద్ ను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంతం నుంచి 1 వ వార్డు లోకి వెళ్లే వారికి… రోడ్డు లేక దాదాపు గా పావు కిలోమీటరు దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, గత వారం కాలనీ వాసులు మూకుమ్మడిగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ కు కలిసి వినతిపత్రం అందజేసి కాలనీలో ఉన్న సమస్యలను వివరించారు. రెండోవార్డు నుంచి ఒకటో వార్డు వెళ్లే వారి కోసం అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయడం కోసం పైపులైను ఏర్పాటు చేసి కాలనీ వాసుల సమస్యను పరిష్కరిస్తానని తెలిపి, ఇట్టి పనులను సైతం మంగళవారం ప్రారంభి స్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. క్షేత్ర స్థాయిలోకి సంబంధిత అధికారులతో వచ్చిన చైర్మన్, ఇందుకు సంబంధించి పనులను చేపట్టేందుకు మున్సిపల్ ఏఈ, కాంట్రాక్టర్లను సైతం పిలిపించి పనులను మంగళవారం ప్రారంభించాలని ఆదేశించడం పట్ల రెండవ వార్డు కాలని ప్రజలు చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ శ్రీహరి రాజు, ఏ ఈ వినోద్, కౌన్సిలర్ అల్లం శ్రీను, నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, గాదె తిరుపతి, బిట్ల సురేందర్, కాలనీ వాసులు మహేష్, అమృత్ తదితరులు ఉన్నారు.