దైవదర్శనంలో ప్రభుత్వ ఆప్కార్ మార్క్ ఫెడ్ చైర్మన్
— మారా గంగారెడ్డి

రామారెడ్డి , నవంబర్ 4 ( లోకం తీరు ) : తెలంగాణ ప్రభుత్వ ఆప్కాబ్ మార్క్ ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వెలిసినటు వంటి స్వయంభు బుగ్గ రామేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. పూజ అనంతరం మాట్లాడుతూ మార గంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపినట్టు వారు తెలిపారు.కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు అనీఫ్ మొహమ్మద్,
తదితరులు పాల్గొన్నారు.