Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

0 1

తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: భూపాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ లక్ష్మీ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేసిన విద్యార్థులను తహశీల్దార్ అభినందించి నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, వేడుకలకు హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అంజలి రెడ్డి, గిర్ధవార్ రామస్వామి, కార్యాలయ సిబ్బంది, గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.