Take a fresh look at your lifestyle.

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి….

0 1,129

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

— గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను వెంటనే

   చెల్లించాలి.
— గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్ విధానంను రద్దుచేయాలి.
— తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ డిమాండ్

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 25 (లోకంతీరు) : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం పెద్దఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హేచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కామారెడ్డి జిల్లా వ్యాపితంగా గత అనేక నెలలుగా జీతాలు రాక గ్రామపంచాయతీ కార్మికులు అవస్థలు పడుతున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం శోచ నియమం అన్నారు.మంత్రులు,ఎమ్మెల్యేలు లక్షల్లో ప్రతినెల జీతాలు తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్మికులకు ఆకలితో అల్మడింపజేయడం తగదన్నారు. వెంటనే జిల్లా అధికారులు ప్రభుత్వ అధినేతలు చర్యలు తీసుకొని పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మున్సిపాలిటీలో 60 జి వో అమలు చేస్తూ గ్రామపంచాయతీకి వర్తింపచేయకపోవడం కార్మికుల శ్రమని పరోక్షంగా దోచుకోవడం అని ఎద్దేవా చేసారు. 60 జీవో అమలు చేసి పిఆర్సి వర్తింపచేయాలని కోరారు.12,769 గ్రామపంచాయతీలో సుమారు 60 వేల మంది పనిచేస్తున్న పీఎఫ్ వర్తింప చేయకపోవడం వల్ల ఈడీఎల్ అమలు కావట్లేదు,రిటర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా వర్తించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే కార్మిక లోకం సమ్మెకు సహితం దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ జిపి వర్కర్లకు ఈఎస్ఐ,గ్రాటియిటి చట్టాల్ని, ప్రతి కార్మికకు 5 లక్షలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక మంది చనిపోయిన కుటుంబాలను జిల్లా, రాష్ట్ర అధికారులు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో వీధిన పడ్డాయి అన్నారు.
కార్మికులకు శానిటేషన్ వస్తువులు, దుస్తులు ప్రతినెల రెగ్యులర్ గా ఇవ్వాలని స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో అవి కూడా సకాలంలో అందించని అధికారులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఏ ప్రకాష్ ,బి కిషోర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు జి సురేష్, సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ నాయకులు, ఏఐపి కె ఎస్ జిల్లా నాయకులు ఎస్. కిషోర్, మండల నాయకులు కె .గోపాల్, శ్రీధర్, రాజేందర్, గంగరాజు, శివరాజు, రాకేష్
,పాటి రాజాం, , లక్ష్మణ్, బాల్ రాజవ్వ, రాజమణి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.