Take a fresh look at your lifestyle.

వైద్యుడి నిర్లక్ష్యమే నా కొడుకు మృతికి కారణం : సింగరేణి ఉద్యోగి ఆరోపణ.

0 2

వైద్యుడి నిర్లక్ష్యమే నా కొడుకు మృతికి కారణం.
సింగరేణి ఉద్యోగి మంథని సంపత్ ఆరోపణ.
డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 11:సింగరేణి ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని సింగరేణి కార్మికుడు మంథని సంపత్ ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సంపత్ మాట్లాడుతూ తమ కుమారుడు హోసన్న ఇటీవల మంథని ప్రాంతంలో బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళితే అక్కడి వైద్యులు అంబులెన్స్ వద్దకే వచ్చి చూసి, తలలో తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే అత్యవసర చికిత్స అందించాలని చెప్పారని, తాను సింగరేణి ఉద్యోగి కావడంతో స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తే డ్యూటీ డాక్టర్ స్ట్రెచర్ పైనే పరీక్షించి ఏమి కాదని చెప్పారని, వేరే హాస్పిటల్ కు రెఫర్ చేయడంలో జాప్యం చేశారని, కనీసం వెంటిలేటర్ అడిగినా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తాము కరీంనగర్ కు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలోనే చనిపోవడం జరిగిందని, తమ కుమారుని మరణానికి పూర్తిగా డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, వెంటిలేటర్ కల్పిస్తే తమ కొడుకు బ్రతికే వాడని ఆరోపించారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సంపత్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.