Take a fresh look at your lifestyle.

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం…!

0 1,263

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం…!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31(లోకంతీరు): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం లో మొదటి విడత లో లక్ష వరకు 17231 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అని రెండవ విడత 1.50 లక్షల లోపు 7497 మంది రైతులకు రుణమాఫీ జరిగింది అని అన్నారు.రైతులు సంబరాలు జరుపుకోవడం గర్వంగా ఉంది అని అన్నారు. అదేవిధంగా 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు ఆగస్టు 15 వ తేదీ లోపే మూడవ విడత రైతు రుణమాఫీ అవుతుంది అని తెలిపారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ దేయం అని గతంలో ఏ ప్రభుత్వం చేయని విదంగా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తుంది అని అన్నారు. ఎవరికైనా రైతులకు రుణమాఫీ కానీ ఎడల తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.