హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక 
బాన్సువాడ నియోజకవర్గం, జనవరి 21( లోకం తీరు ) :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం హున్నాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల పురం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్ రాజారెడ్డి, వర్ని మండల ప్రెసిడెంట్ సురేష్ బాబా మరియు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపిటిసిలు మరియు కార్యకర్తల సమక్షంలో గ్రామ ప్రజలు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి చెప్పడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షున్ని గట్టు సాయిలు ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు గా, శేషారెడ్డి, మిన్ను, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వినోద్, ఢీ.మహేష్, మహిపాల్, ట్రేడరిగా గోపి, సోషల్ మీడియా ఇంచార్జ్ గా సాయిలు, రాంమోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం. సురేష్, పి మారుతీ, ఆసిఫ్ ఖాన్, పి శంకర్, భి సతీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

