గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దిశానిర్దేశం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 22: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. తమ పరిధిలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను వ్యక్తిగతంగా కలిసి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు చొరవ తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని గండ్ర వెంకట రమణా రెడ్డి కోరారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి విజయవంతం చేయడంలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.