Take a fresh look at your lifestyle.

గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ఏఐటియుసి నాయకులు.

0 3

గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ఏఐటియుసి నాయకులు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కోల్ సిటి (గోదావరిఖని), అక్టోబర్ 22:సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ లో జనరల్ అసిస్టెంట్ ట్రేని గా విధులు నిర్వహిస్తున్న అన్వికేత్ షీల్ ,జిడికె 2.ఇంక్లయిన్ లో జనరల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒద్ది శ్రీనివాస్ అనే ఇరువురు కార్మికులకు గురువారం విధి నిర్వహణలో భాగంగా ప్రమాదం జరిగింది. దాంతో వారిని చికిత్స నిమిత్తం గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలిసి వెంటనే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ హాస్పిటల్ కు వెళ్లి కార్మికులను పరామర్శించారు.కాగా ప్రమాదం వివరాలు తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను కోరగా, డాక్టర్ లు వారిని హైదరాబాద్ హాస్పిటల్ కు పంపారు. పరామర్శించిన వారిలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, బ్రాంచి సహాయ కార్యదర్శి మాదన మహేష్, ఫిట్ కార్యదర్శులు మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఉప్పులేటి తిరుపతి, నాయకులు కెక్కర్ల ప్రశాంత్, పైడిపల్లి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.