Take a fresh look at your lifestyle.

కిమ్స్ ఆస్పత్రిలో సువర్ణను పరామర్శించిన సిరికొండ.

0 3

కిమ్స్ ఆస్పత్రిలో సువర్ణను పరామర్శించిన సిరికొండ.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
టేకుమట్ల, అక్టోబర్ 21: జయశంకర్-భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన రావికంటి సువర్ణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని టేకుమట్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు జక్కుల కిరణ్ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సిరికొండ మధుసూదనాచారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సువర్ణను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సువర్ణకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.