Take a fresh look at your lifestyle.

సింగరేణిపై మమకారంతో 71 ఏళ్ల వయసులోనూ పర్యటన – రిటైర్డ్ జీఎం ఎం. నరసింహమూర్తి గనుల సందర్శన.

0 2

సింగరేణిపై మమకారంతో 71 ఏళ్ల వయసులోనూ పర్యటన.
రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎం. నరసింహమూర్తి భూపాలపల్లి గనుల సందర్శన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 31: సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసి జనరల్ మేనేజర్ (ఈఅండ్‌ఎం) హోదాలో పదవీ విరమణ చేసిన ఎం. నరసింహమూర్తి, సంస్థపై తనకున్న అపారమైన మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. 71 ఏళ్ల వయసులోనూ సింగరేణి ప్రాంతాలను సందర్శించాలనే ఆసక్తితో రెండు రోజుల పర్యటనకు వచ్చి భూపాలపల్లి ఏరియాలోని గనులతో పాటు చెల్పూర్‌లోని జెన్కో, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడిన నరసింహమూర్తి శుక్ర, శనివారాల్లో తన పర్యటనను కొనసాగించారు. ఇందులో భాగంగా తొలుత చెల్పూర్‌లోని జెన్కో కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-6 భూగర్భ గని, కేటీకే ఓపెన్‌కాస్ట్-2 గనులను సందర్శించి అక్కడి ప్రాంతాలను పరిశీలించారు. సింగరేణిలో తాను పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ గనుల ప్రాంతాల్లో పర్యటించడం విశేషం. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరానికి చేరుకుని శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఏ.వి. శేషగిరిరావు, కె.ఎస్. చౌదరి, ఎస్. రామకృష్ణారెడ్డి ఉన్నారు. పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ, సింగరేణి సంస్థతో తనకున్న అనుబంధాన్ని మరచిపోకుండా 71 ఏళ్ల వయసులోనూ పాత పని ప్రాంతాలను సందర్శించడం సంస్థపై ఆయనకున్న అభిమానానికి నిదర్శనంగా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.