Take a fresh look at your lifestyle.

జాతీయ బాలికల దినోత్సవం నిర్వహణ….

0 135

అంగన్వాడి సెంటర్ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహణ…

 

 

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి ,జనవరి 24  (లోకం తీరు ) : రామారెడ్డి మండలంలోని అంగన్వాడి సెంటర్లలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల ప్రవేశపెట్టిన చట్టాలతో బాలికల అభ్యున్నతికి తోడ్పడుతున్నాయని అన్నారు.లింగ వివక్ష, నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితులు వెరసి బాలికల అభ్యున్నతిని అడ్డుకుంటూ వచ్చాయి. వారిని వంటింటికే పరిమితం చేసేలా ఆంక్షలు విధించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అన్నింటా బాలికలు రాణిస్తుండడమే ఇందుకు కారణం నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో సరికొత్త చరిత్రను బాలికలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్తమాన పరిస్థితులు బాలికలకు పటిష్టమైన భద్రతను కలి్పంచే దిశగా చట్టాలు సాగుతున్నాయి.
బాలికల సంరక్షణ, వారి చదువులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలను అమలు చేస్తోంది. బేటీ పడావో–బేటీ బచావో కార్యక్రమంతో భ్రూణహత్యల నివారణతో పాటు బాలికావిద్యాభివృద్ధికి బాటలు వేసింది. బాలికల భవిష్య నిధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం కోసం పీఎం బాలికా సురక్ష యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రిడ్జ్‌ కోర్సులను ఏర్పాటు చేసి వయసుకు తగ్గ తరగతిలో డ్రాపౌట్‌ బాలికలు చదువుకునేందుకు అవకాశం కలిపంచింది. అర్ధంతరంగా చదువు మానేసిన బాలికలకు కస్తూర్బా పాఠశాలలు కేజీబీవీ వరంగా మారాయి.ఒకప్పటితో పోల్చుకుంటే తల్లిదండ్రుల్లోనూ బాలికల పట్ల స్పష్టమైన మార్పు వచ్చింది. ఆడపిల్లల పట్ల ఎక్కువ అభిమానం చూపించే స్థితికి చేరుకున్నారు. ఆడపిల్లలతో తండ్రికి విడదీయలేని బంధం ఏర్పడుతోంది. చదువు విషయంలో బాలికలు చూపుతున్న శ్రద్ధ, తెలివితేటలేనని ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువెందుకంటూ ఇంటికే పరిమితమైన పరిస్థితి నుంచి నేడు సంపూర్ణ ఆధిపత్యం సాధించే దిశగా బాలికలు పట్టు సాధించారు. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో బాలికల గొప్పతనం కొనసాగుతూ వస్తోంది.
బాలికలకు మరింత భద్రత గత చట్టాల కన్నా దిశ చట్టం ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఇది చట్టబద్ధత పొందే అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతోంది. దీంతో గతంతో పోలిస్తే బాలికలు, మహిళల పట్ల వేధింపులు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి పాఠశౠల, కళాశాలల్లో చదుతున్న బాలికల చేత దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, వినియోగంపై అవగాహన కనిపిస్తున్న ప్రభుత్వ వానికి బాలికల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు అంజమ్మ, గాలవ్వ, మాధవి, అనసూయ, సెంటర్లోని పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.