ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్బడిన విషాద సంఘటన.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్బడిన విషాద సంఘ టన కోటగిరి మండలం ఎక్లాస్పుర్ క్యాంప్లో చోటు చేసుకొంది. సంఘటనకు సంభందించిన వివరాలాను స్థానిక ఎస్.ఐ సందీప్ కుమార్ తెలిపిన ప్రకా రం.కానురి రాఘవరావు కుమారుడు కానురీ రాజ శేఖర్ నిలకడ లేని మనస్తత్వం వలన అప్పుడప్పుడు ఇంటిలో నుండి వెళ్లిపోయి కొన్ని రోజులకు తిరి గి ఇంటికి వచ్చేవాడని.జనవరి 31 న స్కూల్ కి వెళుతున్న అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిన రాజ శేఖర్ తిరిగి రాలేదు. ఎప్పటిలాగే రాజశేఖర్ ఇంటికి తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు అనుకోన్నారు.కానీ ఫిబ్రవరి 16 నాడు రాత్రి 11:30 గం.ల ప్రాంతంలో ఎవరైనా ఏదైనా అంటారేమో అని అనుకోన్న రాజశేఖర్ జీవితంపై మనస్తాపం చెంది గ్రామంలోని డీ 28/1 నిజాంసాగర్ కెనాల్ పక్కన కిరోసిన్ పోసుకుని ఆయన తగలపెట్టుకొన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళరు. చికిత్స పొందుతున్న రాజశేఖర్ సోమవారం మధ్యాహ్నం చనిపోయినాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ సందీప్ కుమార్ తెలిపారు.