Take a fresh look at your lifestyle.

టిఎస్ఎంఎస్ విద్యార్థినీ విద్యార్థులకు రక్తహీనత ముక్త్ భారత్ పరీక్షలు

0 148

బాల్కొండ మండలంలో…..

టిఎస్ఎంఎస్ విద్యార్థినీ విద్యార్థులకు రక్తహీనత ముక్త్ భారత్ పరీక్షలు.

 

బాల్కొండ, జనవరి 24 ( లోకం తీరు ) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క రక్త నమూనాలను సేకరించనున్నారు.రక్తహీనత ముక్త్ భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, దీని ప్రకారము 8వ తరగతి నుంచి కాలేజీ వరకు చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి వారి యొక్క హెచ్పి పర్సంటేజ్ ని నిర్ధారించడం జరుగుతుంది, రక్తహీనత ఉన్నట్టయితే వారికి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ బాల్కొండ లో ప్రారంభించడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉమ్మడి బాల్కొండ మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు 8వ తరగతి నుంచి కాలేజీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటున్న అందువలన విద్యార్థులు ఆరోగ్యంగా ఎలాంటి రక్తహీనత సమస్యలు ఉన్న వారికి పూర్తిగా రక్తహీనత నుండి ముక్తి కలిగించే విధంగా వైద్య ఆరోగ్య మరి కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్టు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్ ,మెడికల్ ఆఫీసర్ సూర్యనారాయణ జాదవ్, ఆర్ బి ఎస్ కే ఏఎన్ఎం స్వరూప రాణి, వైద్య ఆరోగ్యశాఖ ఎంపీహెచ్డబ్ల్యు రాజు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ పాఠశాలలో సుమారు 600 పైగా విద్యార్థులకు సుమారు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.ఉమ్మడి ఉమ్మడి బాల్కొండ మండలంలో సుమారు 6000 పైగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.