నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోచారం జన్మదిన వేడుకలు

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : మాజీ మంత్రి, మాజీ స్పీకర్,బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు అనగా శనివారం రోజున కోటగిరి,పోతంగల్ మండల కేంద్రాలలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాలలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏజాజ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోతంగల్లో ఉదయం 10-00 గం.లకు అలాగే కోటగిరిలో ఉదయం 11-00గం.లకు జరిగే ఈ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్,పలు సేవా కార్యక్ర మాలు ఉంటాయని ఆయన చెప్పారు.బీఅర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకు లు,ముఖ్య నేతలు,కార్యకర్తలు, పోచారం అభిమానులు వేడుక ల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.