Take a fresh look at your lifestyle.

ప్రారంభంమైన వరి కోతలు….అన్నదాతలలో హర్షం

0 1,281

ప్రారంభంమైన వరి కోతలు….అన్నదాతలలో హర్షం

కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్ర లలో పలు చోట్ల ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధాన్యం రాశులు చేరుతున్నాయి.మొన్నటి వరకు పుష్కలంగా వర్షాలు కురవడంతో అనుకున్న స్థాయిలో పంటలు చేతికి వస్తు న్నాయి.మండలంలోని సిరికొండ ,మైలారం, కొండురు, పందిమాడుగు, పాకాల,కోటల్ పల్లి,పలు తండల తదితర గ్రామంలో ఖరీఫ్ వరి పంటలు వరి కోత యంత్రం సహాయంతో ప్రారంభమైయ్యాయి.సాగు నీటికి ఇబ్బందులు లేకుం పలు చేరువులు, కుంటలు, ద్వారా,బోరు బావులతో పుష్కలంగా పంటలు సాగు చేశారు.ఈ ఖరీఫ్ లో రైతులు ఏమాత్రం నీళ్లకు ఇబ్బంది పడకుండా,సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తూ కొన్ని మత్తడులు కూడా పారు తున్నాయి. 24 గంటలపాటు ఉచితంగా కరెంట్‌ సరఫరా అవుతుండడంతో రైతులు పంటలు వేసి ఆశించిన రీతిలో వరి పైరు దిడుబడి బాగుంది.అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జూలై చివరి వారంలో వర్షాలు మొదలై రైతులు నాట్లు ప్రారంభించారు. రైతుల పొలాలు కోతకు వచ్చాయి. దీంతో పంటలు ఆశించిన విధంగా ఉండడంతో ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల దాకా ధాన్యం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.