Take a fresh look at your lifestyle.

మున్నూరు కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి…

0 1,128

మున్నూరు కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి

– మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

– జిల్లా నాయకులు రావుల ప్రభాకర్

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (లోకంతీరు) : మున్నూరు కాపులకు జనాభా ప్రతిపాదన ప్రత్యేక కల్పించాలని మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు రావుల ప్రభాకర్ అన్నారు. ఆదివారం మాచారెడ్డి ఎక్స్ రోడ్లో మౌన పోరాట దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు రావుల ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపుల జనాభా ఎక్కువగా ఉంటుందని ఆ ప్రతిపాదికని తమకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. అనంతరం గజ్య నాయక్ తండా గ్రామ అధ్యక్షుడు ముదం నర్సింలు మాట్లాడుతూ తమ కులాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని సోమవారం మౌన దీక్ష చేశామనీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్నూరు కాపు సంగం అధ్యక్షులు కొండా దేవయ్య , జిల్లా అధ్యక్షులు మామిండ్ల అంజయ్య ఆదేశాల మేరకు, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నీలం నర్సింలు. (మాచారెడ్డి ఎక్స్ రోడ్ ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు మ్యాడం ప్రభాకర్, సలహా దారులు శ్రీకాంత్, శ్రీనివాస్, కల్పన, ముదాం లక్ష్మి, రాజమణి, క్రాంతి కుమార్, నవీన్, నిఖిల్, భరత్, సూరజ్, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.