విద్యుత్ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు) : సదాశివనగర్ మండల కేంద్రంలోని భూంపల్లి గ్రామంలో పదో వార్డులో ఏళ్ల తరబడి ఉన్న ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు. ఏంమాత్రం కనురెప్ప సమయంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు విద్యుత్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఏళ్ల తరబడిగా ఇబ్బందుల్లో కాలని వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఏళ్ల తరబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. అదేవిధంగా ఎనిమిదవ వార్డ్ లో కూడా ఇళ్లపై విద్యుత్ తీగలు వేలాడుతూ ఉంటున్నాయి విద్యుత్ తీగలు స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి అధికారులు పట్టించుకోవడం లేదని పదో వార్డ్ ప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గత్యంతరం లేక కర్రలను పాతి కిందికి వేలాడుతున్న వైర్లకు సపోర్టుగా ఉంచుతున్నారు. గ్రామాల్లో కిందికి వేలాడుతున్న కరెంటు తీగలను వంగిన స్తంభాలను సరి చేయాలి కానీ అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం మరమ్మత్తులు చేపట్టుతున్నారు గ్రామ ప్రజలు ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న స్తంభాలను తీగలను సరిచేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.