Take a fresh look at your lifestyle.

ఉత్తమ ఓటరుకు సన్మానం…

0 1,254

తల్లి శవాన్ని ఇంటిలో ఉంచుకుని ఓటేసిన కుటుంబం.

కామారెడ్డి జిల్లా , ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటే పల్లి గ్రామానికి చెందిన నీరుడి అశోక్ ను ఉత్తమ ఓటరుగా గుర్తించి కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల రోజే ఉదయం నీరుడి అశోక్ అమ్మ నీరుడి చంద్రవ్వ పాము కాటువేసి మరణించిందని తెలిపారు.దుఃఖాన్ని దిగమింగుకుని నీరుడి అశోక్,ఆయన భార్య వసంత శవాన్ని ఇంటిలో ఉంచి ముందుగా ఓటేసి వచ్చారని తెలిపారు.వారితో పాటు వారి కులస్థులైన దళితులందరు ఉదయమే ఓటేసి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

నీరుడి అశోక్ కుటుంబంతో పాటు దళితులందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల సంఘం కూడా అశోక్ ను ఉత్తమ ఓటరుగా గుర్తించి తగిన విధంగా గౌరవించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,సింగిల్ విండో డైరెక్టర్లు పెంటయ్య, గంగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగులా గౌడ్, రసూల్ పటేల్,షేక్ రియాజ్,హన్మాండ్లు,సాయులు, విఠల్,విజయ్, చాంద్ పాషా,ఇస్మాయిల్ పటేల్, నీరుడి అశోక్, బందిగి పర్వయ్య,రాంచందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.