Take a fresh look at your lifestyle.

మార్కండేయ జయంతి వేడుకను పురస్కరించుకొని గ్రామాల వారిగా  కండువల పంపిణీ…

0 1,690

మార్కండేయ జయంతి వేడుకను పురస్కరించుకొని గ్రామాల వారిగా  కండువల పంపిణీ.

బాల్కొండ, ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం  ఆధ్వర్యంలో అధ్యక్షులు మానేటి నాగభూషణం, కార్యదర్శి రాజుల రామనాథం ఆధ్వర్యంలో సోమవారము జరిగే భక్త మార్కండేయ కండువలు గ్రామ పద్మశాలి సంఘాల కు పంపిణీ చేయనైనది, ఈ సందర్భంగా బాల్కొండ మండల పద్మశాలి అధ్యక్షులు మానేటి నాగభూషణం మాట్లాడుతూ పద్మశాలి సంఘ సభ్యులు అందరూ సంఘటితంగా ఏర్పడి రాజకీయంగా సామాజికంగా ప్రతి సభ్యుడు ఎదగాలని ఆయన అన్నారు, బాల్కొండ పట్టణ అధ్యక్షులు మధుకర్ మాట్లాడుతూ మార్కండేయ జయంతి సందర్భంగా బాల్కొండ మార్కండేయ మందిరంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల పద్మశాలి అధ్యక్షులు మానేటి నాగభూషణం, కార్యదర్శి రాజుల రామనాథం, బాల్కొండ పట్టణ పద్మశాలి అధ్యక్షులు మధుకర్, కోశాధికారి రాజేందర్, సంయుక్త కార్యదర్శి కపిల్, మరియు సంఘ సభ్యులు నవిన్, సుమన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.