Take a fresh look at your lifestyle.

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర-2….

0 1,480

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర-2

  •  కేంద్ర ప్రభుత్వ పథకాలను సాధ్వినియోగం చేసుకోవాలి.
  •   అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

నిజామాబాద్ అర్బన్ , ఫిబ్రవరి 13( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని నాగారం పదవ డివిజన్ లొ గోశాల దగ్గర ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర -2 కార్యక్రమానికి ముఖ్యతిథిగా అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారత దేశ అభివృద్దే లక్షంగా దేశంలో పల్లెలు, పట్టణాల అభివృద్దే ద్యేయంగా పని చేయడం జరుగుతుందని, అట్టడుగుస్థాయి చిట్టచివరకు ఉన్న నిరుపేదలకు కూడ కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో బిజెపి పార్టీ పని చేస్తుందని, అందులోనే భాగంగా నవంబర్ 15న ఆదివాసీ ముద్దుబిడ్డ బిర్స ముండా జయంతి, ఆదివాసీ గౌరవ దివస్ సందర్బంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఢిల్లీ నుండి గల్లీ, గల్లికి మోడీ సంక్షేమ పథకాల బండి రెండో విడత వస్తుందని, కేంద్రప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం వారి సంక్షేమం కోసం ఉజ్వల యోజన క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్స్,గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ఉచిత కరోనా టీకా,స్వచ్ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ పథకంతో ఐదు లక్షల బీమా, ముద్ర యోజన కింద చిరు వ్యాపారులకు చేయూతగా, సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడబిడ్డలకు ఆర్ధిక భద్రత, అవస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం, విశ్వకర్మ యోజన కింద చేతి వృత్తుల వారికీ చేయూతగా ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, ఇంకా అర్హులైన వారందరు వెంటనే దరఖాస్తు చేసుకొని లబ్ది పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్,ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి,మాస్టర్ శంకర్, ఇప్పకాయల కిషోర్,సుదీర్,ప్రవళిక & శ్రీధర్ మెట్టు విజయ్,సుక్క మధు,ఆకుల శ్రీనివాస్,వెల్డింగ్ నారాయణ,మండల అధ్యక్షులు వీరేందర్,గడ్డం రాజు,పవన్,చిరంజీవి సతీష్ గట్ల గంగాధర్, దీపక్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.