Take a fresh look at your lifestyle.

ఇందూర్ నుండి అయోధ్య కు..ప్రత్యేక ట్రైన్

0 1,680

ఇందూర్ నుండి అయోధ్య కు బయలుదేరిన ప్రత్యేక ట్రైన్

  • అస్తాను జెండా ఊపి ప్రారంభించిన
  • ఎంపీ ధర్మపురి & ఎమ్మెల్యే ధన్ పాల్

 


నిజామాబాద్ , ఫిబ్రవరి 13  ( లోకంతీరు ) : నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గల నుండి హిందూ బంధువులు పెద్దఎత్తున అయోధ్య కు బయలుదేరడం జరిగింది, ప్రత్యేక ట్రైన్ అస్తా సికింద్రాబాద్ నుండి బయలుదేరానుండగా పార్లమెంట్ పరిధిలో 1344 మంది భక్తులు ఉండటంతో వారికీ ఇబ్బంది కాకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు & ధర్మపురి అరవింద్ గారు ప్రత్యేక చొరవతీసుకొని నిజామాబాదు నుండే వెళ్ళేవిదంగా భక్తులకు సౌకర్యం కల్పించడం జరిగింది, ఈ సందర్బంగా తెలంగాణ అయోధ్య ట్రస్ట్ కో కన్వీనర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ భవ్యమైన బాల రాముని దర్శించుకోవడం హిందువుల ఐదు వందల ఏండ్ల నాటి కల సాకారం అయిందని, ఎంతో మంది కర సేవకుల ప్రాణాత్యగల ఫలితం, వారి ఆత్మలు కూడా నేటితో శాంతిస్తాయని,ఆ బాల రామున్ని దర్శించికోవడం పూర్వజన్మ సుకృతం అని, రామారాజ్యానికి ఇది ఆరంభం అని అన్నారు,భక్తులందరికి ప్రయాణామర్గంలో ఇటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ & వాటర్ ఏర్పాటు చేశామని అయోధ్య చేరుకున్నాక దర్శనం కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేసారు హిందూబందువులకు ఈ అవకాశం కల్పించిన బిజెపి కేంద్ర నాయకత్వానికి, మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు.ధన్ పాల్ లక్ష్మి బాయ్ &విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నిజామాబాదు పార్లమెంట్ నుండి వెళ్లే భక్తులందరికి భోజనం & వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలొ బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి,నాగోళ్ళ లక్ష్మీనారాయణ, భోగ శ్రావణి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.