Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ కి ప్లేట్ల పంపిణీ….దానం చేసే సేవా గుణం

0 1,452

సేవా కార్యక్రమాలలో  అన్నిటికీ ముందుండే… హకీమ్

  • ఎంత సంపాదించిన దానం చేసే సేవా గుణం కొందరికే ఉంటుంది.

  • అంగన్వాడీ కి 30 ప్లేట్లు పంపిణీ చేసిన హకీమ్.

  • కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్.

 

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 23 ( లోకంతీరు) : సమాజంలో సేవ చేసే గుణం కొందరికే ఉంటుందిని, అలాంటి కోవకు చెందిన ఎం.ఏ హకీమ్ తన జన్మనిచ్చిన గ్రామా నికి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు దాతగా ఎం.ఏ హకీమ్ చేతుల మీదుగా 30 ప్లేట్లను స్థానిక,పోతంగల్ మండల నాయకులు,ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో పంపి ణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన షేక్ మహ మ్మద్ ఆర్మీ జవాన్ తన పదవి విరమణ పొందిన నేపథ్యంలో ఆయనకు ఈ వేదికగా ఘనం గా సన్మానించారు.ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ. పుట్టిన ఉరుపై మమకారంతో సేవచేసే వారిని చెడుగా మాట్లా డటం మంచి సంస్కృతి కాదన్నారు.ఎం.ఏ హకీమ్ కుటుంబ సభ్యులు తరతరాలు గా గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.గతంలో జెడ్పిటిసిగా పనిచేసిన పుప్పాల శంకర్ గ్రామానికి 6 బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎం.ఏ హకీమ్ గ్రామానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజయ సుల్తానా, ఎంపీటీసీ రాములు,జీపి కార్యదర్శి రాజేశ్వరి,ప్రత్యేక అతిథులు షాహిద్,తాజా మాజీ సర్పంచ్ అమినా బీ షేరు,శాంతాబాయి,శంకర్, యశ్వంత్,మస్తాన్,గౌస్,వాజిద్,బాబా,ఇస్మాయిల్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.