బట్టి మాటలన్నీ ఉత్త మాటలే…
–అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, జులై 25 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నామ్ చేస్తూ నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న మతాలబ్ ఏంటో తెలంగాణ ప్రజలకు ఈ రోజు తేటతెల్లం అయ్యిందని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలనుండి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ చేసిన కుట్రలో భాగమే నేడు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిదర్శనం అని కేంద్ర ప్రభుత్వం తెలంగానికి ఏమి ఇచ్చింద అని నిన్న అసెంబ్లీ చర్చ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ చిన్న ఉదాహరణగా ఎఫ్ సి ఐ కింద కేవలం మూడు నెలలకు 3,561 కోట్ల నిధులు ఇస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 3,836 కోట్లు మాత్రమే ప్రవేశ పెట్టిందని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చిందంటు మల్లి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులపైనే ఆధారపడాల్సి వస్తుందని కేవలం ఒక సంవత్సరానీకె దాదాపు 70 వేల కోట్ల అప్పుకు ప్రతిపదించడం జరిగిందని తెలంగాణాలో ఇండ్లు లేని నిరు పేద, మధ్యతరగతి కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళల్లో కారం కొట్టిందని గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో 10 ఏళ్ళు మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మా ఇండ్ల పేరుతో మల్లి మోసం చేస్తుందని, స్థలం ఉన్నవారికి 5లక్షలు ఎస్ సి,ఎస్ టి లకు 6లక్షలు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని దానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని దీనిపై ప్రభుత్వం పునరాలోచ చేయాలి అని డిమాండ్ చేసారు,తెలంగాణ నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలకు అన్యాయం చేసిందని వారి కుటుంబంలో ఇంటికో ఉద్యోగం అన్నారు, గౌరవ వేతనం 25000 వేలు అన్ని ఉత్త మాటలుగా మిగిలాయాన్నారు నిరుగ్యోగులకు 4000 భృతి ఊసే లేదని,మహిళలకు ఇస్తానన్న 2500 పై ఎటువంటి స్పష్టత లేదని, చేయూత కింద మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4000 పెంచుతామన్నా రేవంత్ సర్కార్ గప్పాలు కొట్టి ఇప్పుడు దానికి నిధులు కేటాయించకపోవడం పై మండిపడ్డారు,నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం అన్నారు కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని, యాభైరెండు శాతం ఉన్న బిసిలకు 9 వేల కోట్లు ప్రకటించి అన్యాయం చేసిందన్నారు.