నేడు చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం
– రక్తదాతలు చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలి
కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం రోజు ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, చిన్నారులకు రక్తం దొరకక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారి ప్రాణాలను కాపాడాలని మంచి ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి లు రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించడానికి రావడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. ఒక రక్తదాత చేసే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను 15 రోజుల పాటు కాపాడవచ్చునని, రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. రక్తదానం చేయాలనుకునేవారు మరిన్ని వివరాల కోసం 9492874006 నంబర్ ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్ హైమద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, రమణ లు తదితరులు పాల్గొన్నారు.