మోర్తాడ్ లైన్స్ క్లబ్ కు ఉత్తమ పురస్కారాల ప్రదానోత్సవం…

మోర్తాడ్, మార్చ్ 05 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రోజు రీజియన్ ఫోర్త్ కాన్ఫరెన్స్ ఈరోజు 13 క్లబ్బులు పాల్గొన్నాయి. అందులో భాగంగా మంచి సేవలందించిన క్లబ్బులకు సేవ పురస్కారాలు అవార్డులు లభించాయి. ఇట్టి అవార్డులను లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ బాబురావు గారు రీజియన్ చైర్పర్సన్ మహమ్మద్ నవిద్ నురాని గారు, జోన్ చైర్ పర్సన్ వట్టిమల్ల నరసయ్య గారు చేతుల మీదుగా మోర్తాడ్ లైన్స్ క్లబ్ కు బెస్ట్ రీజియన్ క్లబ్ అవార్డు, ఎక్స్లెంట్ డయాబెటిక్ క్యాంప్ అవార్డు, ఎక్స్లెంట్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ అవార్డులను అందజేశారు.
ఎక్స్లెంట్ అవార్డ్ బెస్ట్ విజన్ అవార్డు, బెస్ట్ హెల్త్ క్యాంప్ అవార్డు, బెస్ట్ స్కూల్ యాక్టివేషన్ అవార్డు, ఎక్స్లెంట్ స్క్రాప్ బుక్ అవార్డు, ఎక్స్లెంట్ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు అందజేశారు.. అదేవిధంగా ఉత్తమ బెస్ట్ అధ్యక్షుడిగా శ్రీ మామిడాల మనోహర్ గారికి ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు, ప్రధాన కార్యదర్శి దడివే పెద్ద మోహన్ గరికి ఉత్తమ సెక్రెటరీ అవార్డు, గోపిడి సత్యనారాయణ గారికి ఉత్తమ కోశాధికారి అవార్డును అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పబ్బ సంజీవ్ , పర్స దేవన్న, సామ శ్రీనివాస్, నూతికట్టు గిరిధర్, సంఘం అనిల్ కుమార్, జల్లెండ్ల లింబాద్రి, నిమ్మ రాజన్న, తీగల రమేష్ , దడివే నవీన్, హజారి వినోద్, కుదురుపాక ప్రవీణ్, హజారి శ్రీధర్ పాల్గొన్నారు.