రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు
ముధోల్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్నా -గంగోత్రి అనే విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ సెలక్షన్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ప్రధానోపాధ్యాయులు, పిడి శ్రీనివాస్ ఆకాంక్షించారు.*