Take a fresh look at your lifestyle.

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి సకాలంలో ఏ పాజిటివ్ రక్తం అందజేత….

0 1,599

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి సకాలంలో ఏ పాజిటివ్ రక్తం అందజేత

– ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి

– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సరిత (26) గర్భిణి అనిమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేసారు. వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి నాగిరెడ్డిపేట్ మండలం మాటూరు మాసంపల్లి గ్రామానికి చెందిన బుర్ర సత్యనారాయణ చారి వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గర్భిణీ మహిళకు రక్తాన్ని అందించడం కోసం 60 కిలోమీటర్ల దూరం నుండి రావడం అభినందనీయమని, రక్తదానం చేసినందుకు రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్ రక్తనిధి కేంద్ర టెక్నీషియన్లు జీవన్, సందీప్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.