కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల సమస్యలు తీర్చాలి
– కామారెడ్డి ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేయాలి

కామారెడ్డి జిల్లా బీబీపేట, మార్చి 15 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని బిబిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ గత ఎనిమిది సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా తిరిగారు. మండల కేంద్రానికి చెందిన ఎల్లమైన శ్రీకాంత్ తండ్రి తిరుమల్లయ్య భూమీ ఇప్పటి వరకు పాస్ బుక్ లో 21గుంటల 1/2 భూమి ఎక్కలేదు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన 21 1/2 గుంటల భూమిని వారి పేరున చేయించాలని ఫిర్యాదుల పెట్టె ద్వారా ఎమ్మెల్యే కు తెలిసేలా వినతి చేశారు.