బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా భారీ రోడ్ షో ర్యాలీ.
-
కాంగ్రెస్ మాటలు నమ్మకండి
-
పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ/కోటగిరి, ఏప్రిల్ 21 ( లోకంతీరు ):-కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆ పార్టీని నమ్మి మోసపోవద్దని,అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ మంత్రి,మాజీ స్పీకర్,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,జహిరాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పేర్కొన్నారు.శనివారం కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాలలోనీ ప్రధాన వీధులలో వారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు విఫలమైన విషయాన్ని ప్రజలు తెలుసుకో వాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాట లు చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 బోనస్ ప్రకటిస్తామని, మహిళలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు లక్ష 116లు తులం బంగారం, పింఛన్లు 4 వేలు పెంచుతామని ఉచిత హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేశారని అన్నారు.గతంలో ఇద్దరు వ్యక్తులకు ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చా రని ఈసారి గాలి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ ప్రాంత రైతాంగం,నిరుద్యోగుల గలాన్ని పార్ల మెంట్లో వినిపించడానికి ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ రోడ్ షోలో బాన్సువాడ నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,ఉమ్మడి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,జడ్పిటిసి శంకర్ పటేల్,జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్,మాజీ ఉమ్మడి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నీరడి గంగాధర్,అబ్దుల్ హమీద్,ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.