Take a fresh look at your lifestyle.

సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం…..

0 1,607

సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం
– ఏడు సం.ల మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా రాజంపేట, మార్చి 14 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం గురువారం చేశారు. సి ఎం రేవంత్ రెడ్డి 2017 లో మేడ్చల్ రెడ్డి గర్జన సమావేశంలో మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి సి ఎం అయిన మూడు నెలల లోపు నిలబెట్టుకున్నారని, వారికి రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ర్ట కార్యదర్శి బాణాల మల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట సంతోష్ రెడ్డి, అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి, సంఘ సభ్యులు కుంట నీలం రెడ్డి, అలకొండ సంతోష్ రెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి, అఖిల్ రెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.