ఛాత్రోపాధ్యాయుల సమక్షంలోనే విచారణ చేస్తాం.
– PDSU నాయకులకు RJD హామీ

నిజామాబాద్ ,జులై 23 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో గల డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పై ఛాత్రోపాధ్యాయులు, పి.డి.ఎస్.యు నాయకులు చేసిన ఫిర్యాదులపై వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి ఈరోజు విచారణకు రావడం జరిగింది.ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి కలిసి మాట్లాడుతూ, డైట్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ చాత్రోపాధ్యాయులను మానసికంగా వేధించారని, ఆర్థిక అవినీతికి పాల్పడ్డారని, 34 సంవత్సరాలుగా రూల్స్ కు విరుద్ధంగా ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) నగర కమిటీ ఆధ్వర్యంలో చాత్రోపాధ్యాయులు విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు.విచారణ నిమిత్తం ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి డైట్ కళాశాలకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఐతే చాత్రోపాధ్యాయులు (విద్యార్థులు) తమ టీచింగ్ ప్రాక్టీస్ కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు, కొంతమంది డీఎస్సి పరీక్షల కోసం వెళ్లడం జరిగిందని తెలిపారు. ఏకపక్ష విచారణను వాయిదా వేసి, ఫిర్యాదు చేసిన చాత్రోపాధ్యాయులు మరియు PDSU నాయకుల సమక్షంలో మాత్రమే విచారణ చేపట్టాల్సిందిగా ఆర్జెడిని కోరామన్నారు.ఆర్జెడి సత్యనారాయణ సానుకూలంగా స్పందిస్తూ PDSU నాయకులు, చాత్రోపాధ్యాయుల సమక్షంలోనే మరోసారి డైట్ కాలేజీకి వచ్చి విచారణ చేపడతారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో PDSU విద్యార్థి నాయకులు నసీర్, సృజన్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు