తెలంగాణ అంగన్‌వాడీ సేవలు దేశానికి ఆదర్శం
— యూనిసెఫ్ బృందం పర్యవేక్షణ సంతృప్తి

కామారెడ్డి జిల్లా , జూలై 25 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం యుఎన్ఎఫ్ ప్రత్యేక బృందంఇసన్నపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు.వారు పిల్లలతో ముచ్చటించి, వారితో సరదాగా కాసేపు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, సెంటర్ యొక్క లబ్ధిదారులతో మాట్లాడుతూ తెలంగాణలోని
అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని యునిసెఫ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ప్రైమరీస్కూల్, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల పోషణ విధానాన్ని యునిసెఫ్ ప్రతినిధి బృందం సభ్యులు పరిశీలించారు.రాష్ట్రంలో అంగన్‌వాడీల్లో పిల్లల పోషణ, సంక్షేమంలో అంగన్‌వాడీ కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి గ్రామంలోని మిని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రత్యేక బృందం సభ్యులు, సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్ సృజన, హెల్పర్, చిన్నపిల్లలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.