వర్షంలో సైతం డ్రైనేజి పనులు చేస్తున్న కార్మికులు

కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. రాజంపేట గ్రామంలో శనివారం డ్రైనేజీలను గ్రామ పంచాయతీ కార్మికులు యుద్ధ ప్రాతిపదికన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డ్రైనేజి పరిసరాల ప్రక్కన ఉన్న మొక్కలను గ్రామ పంచాయతీ కార్మికులు తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.